Palnadu జిల్లా దుర్గి మండలం జంగమేశ్వరపాడు లో సంచలనం సృష్టించిన కంచర్ల జల్లయ్య హత్య కేసులో తొమ్మిది నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. జల్లయ్యకు ప్రత్యర్థి వర్గమైన ఊరిబండ మన్నయ్యే అని పోలీసులు తేల్చారు. వీరివురి మధ్య పాత తగాదాలతో పాటు జల్లయ్యపైనా దుర్గి పోలీస్ స్టేషన్ లో ఏడు కేసులు ఉన్నట్లు ఎస్పీ శివశంకర్ రెడ్డి తెలిపారు.